సామ్–చై విడాకులపై కథనాలు ఎంతో బాధించాయి: నాగార్జున
- పుకార్లపై స్పందించిన అక్కినేని హీరో
- కావాలనే చెత్త ప్రచారం చేస్తున్నారంటూ అసహనం
- యూట్యూబ్ చానెళ్లలో ఇలాంటి వాటికి కొదవలేదని ఆవేదన
ప్రస్తుత పరిస్థితుల్లో కావాలనే కొందరు ఇలాంటి చెత్త ప్రచారాలు చేస్తున్నారని, ఇద్దరి విడాకులపై లేనిపోనివి పుట్టిస్తున్నారని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్లలో ఇలాంటి వాటికి కొదవ లేకుండా పోయిందన్నారు. తనపై ఇలాంటి చెత్త ప్రచారాలు చేసినా పట్టించుకోలేదని, పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అనే సూక్తిని తాను నమ్ముతానని, అందుకే వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు. అయితే, తన కుటుంబం గురించి అలాంటి చెత్త కథనాలు ప్రసారం చేసేసరికి బాధపడ్డానని నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాటిని తాను పట్టించుకోనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.