గోపీచంద్ 30వ చిత్రం ప్రారంభం... శ్రీవాస్ తో మూడో చిత్రం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ 30వ చిత్రం ప్రారంభం... శ్రీవాస్ తో మూడో చిత్రం

Gopichand new movie starts in Hyderabad
  •  లక్ష్యం, లౌక్యం తర్వాత శ్రీవాస్ తో గోపీచంద్ సినిమా
  • కెమెరా స్విచాన్ చేసిన టీజీ వెంకటేశ్
  • ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన వీవీ వినాయక్
  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్
టాలీవుడ్ హీరో గోపీచంద్ తన 30వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. శ్రీవాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. లక్ష్యం, లౌక్యం తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఇది. దాంతో కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హ్యాట్రిక్ విజయం ఖాయమని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

కాగా, నేడు హైదరాబాదులో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో గోపీచంద్ పై తొలి షాట్ కు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలకపాత్రకు రాజశేఖర్ ను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
Gopichand
30
New Movie
Opening Shot
Srivass
Tollywood

More Telugu News