Pushpa: ముఖ్య అతిథి లేకుండానే 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్

No special guest for Pushpa pre release event
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప.. ది రైజ్. చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12న హైదరాబాదు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకను స్పెషల్ గెస్టు లేకుండానే నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.

'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. కొన్నిరోజుల కిందట రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే రిలీజైన 'పుష్ప' పాటలు విశేష రీతిలో ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న 'పుష్ప' చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది.
Go Back to Shorts
Pushpa
Pre Release Event
Special Guest
Allu Arjun
Sukumar
Tollywood

More Telugu News