చెన్నైలో ఎస్సై రాజేశ్వరి ఆసుపత్రికి తరలించిన వ్యక్తి విషాదాంతం
- ఇటీవల చెన్నైలో భారీ వర్షాలు
- శ్మశానం వద్ద విరిగిపడిన చెట్ల కింద అపస్మారక స్థితిలో వ్యక్తి
- ఆసుపత్రికి తరలించిన మహిళా ఎస్సై
- చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎస్సై
అయితే, ఆ ఎస్సై శ్రమ ఫలించలేదు. 25 ఏళ్ల ఉదయ్ కుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయం తెలిసిన ఎస్సై రాజేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కాగా, ఆ మహిళా ఎస్సై యువకుడిని కాపాడిన వీడియో వైరల్ కావడంతో పోలీసు అధికారులు ఆమెను అభినందించారు. ఈ విషయం సీఎం స్టాలిన్ వరకు చేరింది. ఆయన ఎస్సై రాజేశ్వరిని తన కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. ఆమె మానవతా దృక్పథాన్ని కొనియాడుతూ ప్రశంసాపత్రం అందజేశారు.