నమీబియాతో న్యూజిలాండ్ పోరు... కివీస్ ఓడితే భారత్ కు చాన్స్
- షార్జాలో మ్యాచ్
- ఈ మ్యాచ్ ఫలితంపై టీమిండియా అభిమానుల్లో ఉత్కంఠ
- టీమిండియా సెమీస్ బెర్తుకు అడ్డంకిగా ఉన్న కివీస్
- కివీస్ ఓడిపోవాలని కోరుకుంటున్న భారత అభిమానులు
ఈ మ్యాచ్ లో కివీస్ ఓడిపోవాలని భారత్ అభిమానులు కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మ్యాచ్ లో కాకపోయినా, తన తదుపరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలోనైనా న్యూజిలాండ్ ఓడిపోవాలన్నది భారత అభిమానుల ఆశ! ఆప్ఘనిస్థాన్ జట్టుకు సంచలనాలు కొత్తేమీ కాదు. ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!