Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 22,431 క‌రోనా కేసులు
  • నిన్న 318 మంది క‌రోనాతో మృతి
  • మొత్తం మృతుల సంఖ్య  4,49,856
  • కేర‌ళ‌లో నిన్న 12,616  కేసులు  
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 22,431 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో వెల్లడైన క‌రోనా కేసుల మొత్తం సంఖ్య 3,38,94,312కి పెరిగింది. నిన్న క‌రోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,00,258కి చేరింది.

అలాగే, నిన్న 318 మంది క‌రోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,49,856కు చేరింది. ప్ర‌స్తుతం 2,44,198 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.

  నిన్న దేశంలో 43,09,525 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92,63,68,608కి పెరిగింది. కేర‌ళ‌లో నిన్న 12,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 134 మంది క‌రోతో ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News