సాయితేజ్ కు వెంటిలేటర్ తొలగించాం: అపోలో వైద్యులు
- ఈ నెల 10న సాయితేజ్ కు రోడ్డుప్రమాదం
- తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన హీరో
- అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ కు సర్జరీ
- సాయితేజ్ ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారన్న డాక్టర్లు
- సొంతంగా శ్వాస తీసుకుంటున్నాడని వెల్లడి
సాయితేజ్ కు వెంటిలేటర్ తొలగించినట్టు వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని, ఆయన సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు. మరికొన్ని రోజుల పాటు సాయితేజ్ ఆసుపత్రిలోనే ఉంటారని ఆ బులెటిన్ లో వివరించారు.
సాయితేజ్ కు రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరగడంతో అపోలో వైద్యులు శస్త్రచికిత్సతో సరిచేశారు. ఈ నెల 10న జరిగిన ఈ రోడ్డుప్రమాదం మెగా కుటుంబంలోనూ, వారి అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగించింది.