అపోలో ఆసుపత్రికి వచ్చి సాయితేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
- ఈ నెల 10న హైదరాబాదులో రోడ్డు ప్రమాదం
- తీవ్రంగా గాయపడిన సాయితేజ్
- అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ కు శస్త్రచికిత్స
- సాయితేజ్ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడిన బన్నీ
మెగా హీరో సాయితేజ్ కు ఈ నెల 10న హైదరాబాదులో రోడ్డు ప్రమాదం జరగడం తెలిసిందే. స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండడంతో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయితేజ్ కాలర్ బోన్ విరగడంతో అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సాయితేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.