Chandrababu: ప్రతి ఒక్క మతాన్ని, మత విశ్వాసాలను ప్రభుత్వాలు గౌరవించాలి: చంద్రబాబు

Chandrababu talks about religious issues
షార్ట్స్‌లో చూడండి
నేడు వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మతాలు, మత విశ్వాసాల అంశంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని, ప్రజల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ప్రవర్తించాలని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడే శాంతి, సౌభాగ్యం వర్ధిల్లుతాయని అన్నారు.

హైదరాబాదులో వినాయక ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని, ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఏ పాలకులు వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క మతాన్నీ, మత విశ్వాసాలను ప్రభుత్వాలు గౌరవించాలని, అది రాజ్యాంగ పరమైన హక్కు అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
Go Back to Shorts
Chandrababu
Religion
Vinayaka Chavithi
NTR Bhavan
Hyderabad
TDP

More Telugu News