Advertisement

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్

Nara Lokesh reaches Rajahmundry airport for Polavaram district tour
  • రేపు పోలవరం జిల్లా రంపచోడవరంలో పర్యటన
  • ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు హాజరు
  • నేడు రాజమండ్రి ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం 
  • కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన లోకేశ్
  • రాత్రికి జగరంపల్లిలో బస చేయనున్న మంత్రి
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పోలవరం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా ఆయన గురువారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి, వారి నుంచి అర్జీలు స్వీకరించారు.

అనంతరం, మంత్రి లోకేశ్ రోడ్డు మార్గంలో పోలవరం జిల్లాలోని రంపచోడవరం బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రికి రంపచోడవరం మండలం జగరంపల్లి వద్ద ఏర్పాటు చేసిన వేదికలో ఆయన బస చేయనున్నారు.

శుక్రవారం ఉదయం రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే 'మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్'లో మంత్రి లోకేశ్ పాల్గొంటారు. ఈ సమావేశంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ముచ్చటించనున్నారు.
Advertisement
Nara Lokesh
Rajahmundry Airport
Rampachodavaram
Mega Parents Teachers Meeting
Andhra Pradesh Education Minister
TDP leaders

More Telugu News