Advertisement

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్‌.. క్లారిటీ ఇచ్చిన సంస్థ

Adani Group denies reports of entering the airline business
  • ఎయిర్‌లైన్‌ వార్తలను ఖండించిన అదానీ
  • అలాంటి ప్రతిపాదన లేదని స్పష్టీకరణ
  • ప్రచారం పూర్తిగా నిరాధారమన్న సంస్థ
  • ఎయిర్‌పోర్ట్‌ సిటీల అభివృద్ధి మాత్రం కొనసాగుతుందని వెల్లడి
విమానయాన వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు వస్తున్న వార్తలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఖండించింది. తాము ఆ రంగంలోకి ప్రవేశించే ప్రతిపాదననేమీ పరిశీలించడం లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ఎయిర్‌లైన్‌ ప్రారంభించనున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు. ఇటీవల అదానీ గ్రూప్‌ విమానయాన రంగంలోకి ప్రవేశించనున్నట్లు కొన్ని మీడియా కథనాలు, మార్కెట్‌లో ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సంస్థ స్పందించింది.

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ ఇటీవల రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడితో ఐదు రాష్ట్రాల్లోని ఆరు విమానాశ్రయాల పరిధిలో సమీకృత ‘ఎయిర్‌పోర్ట్‌ సిటీ’ల అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. అయితే, దీనికి ఎయిర్‌లైన్‌ సేవలు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఎలాంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.
Advertisement
Adani Group
Adani Enterprises
Airline business
Aviation sector
Adani Airports
Airport City project

More Telugu News