Advertisement

ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ.. సర్జరీ సక్సెస్

  • షూటింగ్ సమయంలో గాయపడటంతో అవసరమైన సర్జరీ
  • మూడు గంటల పాటు కొనసాగిన శస్త్రచికిత్స
  • ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపిన వైద్యులు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మోకాలికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు సుమారు మూడు గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కొన్ని రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో ఆ ప్రాంతంలో రక్తం గడ్డకట్టి, వాపు వచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించగా, మోకాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.

దీంతో గురువారం ఆయన ఆసుపత్రిలో చేరగా, వైద్య బృందం విజయవంతంగా సర్జరీ పూర్తి చేసింది. ఈ వార్త తెలియడంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Advertisement

More Telugu News