ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్ఆర్ఎఫ్
- తాత్కాలిక క్యాబినెట్ ను ప్రకటించిన తాలిబన్లు
- ప్రకటన విడుదల చేసిన ఎన్ఆర్ఎఫ్
- ఈ క్యాబినెట్ ఏర్పాటు చట్టవిరుద్ధమని విమర్శలు
- భావి ప్రభుత్వంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
తాలిబన్లు, వారి ఉగ్రవాద మిత్రులకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ఎన్ఆర్ఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘన్ ముఖ్య నాయకులు, విధానకర్తలతో చర్చించి భావి ప్రభుత్వంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.