Gopichand: 'సీటీమార్' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

  • గోపీచంద్ నుంచి 'సీటీమార్'
  • కబడ్డీ నేపథ్యంలో నడిచే కథ 
  • సంపత్ నందితో రెండో సినిమా 
  • 'వినాయక చవితి'కి విడుదల  
Seetimaarr new release date

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' రూపొందింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఈ సినిమాను నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

కానీ ఆ తరువాత దర్శక నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ఖరారు చేస్తామని అన్నారు. కొత్త రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితం ప్రకటించారు. 'వినాయకచవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు చెబుతూ కొత్త పోస్టర్ ను వదిలారు. 'గౌతమ్ నంద' తరువాత గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. మణిశర్మ సంగీతం .. సౌందర రాజన్ కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

More Telugu News