'బొబ్బిలి పులి'గా సంపూర్ణేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బొబ్బిలి పులి'గా సంపూర్ణేశ్ బాబు!

Bazaar Rowdy movie update
  • 'బజార్ రౌడీ'గా సంపూ
  • రేపే ప్రేక్షకుల ముందుకు
  • 300 థియేటర్లలో విడుదల
  • హిట్టుపై నమ్మకంతో ఉన్న సంపూ
తెలుగులోని హాస్య కథానాయకులలో సంపూర్ణేశ్ బాబు స్థానం ప్రత్యేకం. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు చాలా విలక్షణంగా ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి,'బజార్ రౌడీ' సినిమా సిద్ధమైంది. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సంపూ మాట్లాడాడు.

"ఇంతవరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒకటీ ఒక ఎత్తు. నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు - దర్శకుడు వసంత నాగేశ్వరరావు కథను నమ్మేసి రంగంలోకి దిగారు. నా సినిమా నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

'కొబ్బరి మట్ట' సినిమాలో నేను పెదరాయుడు గెటప్ లో కనిపిస్తే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 'బజార్ రౌడీ'లో నేను కొంతసేపు 'బొబ్బిలి పులి' గెటప్ లో కనిపిస్తాను. ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని అనుకుంటున్నాను. రేపు ఈ సినిమాను 300 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాను మీరంతా తప్పకుండా ఆదరించి విజయాన్ని  అందిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.  
Sampurnesh Babu
Maheshwari
Nagineedu

More Telugu News