కోమటిరెడ్డి సోదరులకు డబ్బు సంపాదన పైనే ధ్యాస: మంత్రి జగదీశ్ రెడ్డి
- వారిద్దరికీ ప్రజల్లో విశ్వసనీయత ఎప్పుడో పోయింది
- సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారు
- మీడియా ప్రచారం కోసం పాకులాడుతుంటారు
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎప్పుడూ డబ్బు సంపాదన పైనే ధ్యాస అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సమాజం అభివృద్ధి చెందాలనే తపన ఉంటే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల అమలుకు సహకరించాలని... లేకపోతే సొంత నియోజకవర్గ ప్రజల నుంచే వారికి వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు.
ఇంతకు ముందు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకునేది లేదని.. గుడ్డలు ఊడదీస్తానని హెచ్చరించారు. మీరు భయపెడితే భయపడటానికి తాము కాంగ్రెస్ నాయకులం కాదని చెప్పారు.