బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య?
- బోయపాటి తాజా చిత్రంగా 'అఖండ'
- బాలకృష్ణతో మూడో సినిమా
- నెక్స్ట్ మూవీ బన్నీతో అంటూ టాక్
- సూర్యకు కథ చెప్పిన బోయపాటి
ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉండవచ్చని అంతా అనుకుంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో సూర్యకు కూడా బోయపాటి ఒక కథను వినిపించినట్టుగా చెప్పుకుంటున్నారు. కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. నేరుగా తెలుగులో రూపొందే ఈ సినిమా, తమిళంలోనూ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అల్లు అర్జున్ ప్రాజెక్టు ఆలస్యమైతే ముందుగా సూర్యతోనే బోయపాటి సినిమా ఉంటుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.