ఫిల్మ్ ట్రైబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్రం అత్యవసర ఆదేశాలు.. సినీ రంగానికి దుర్దినమన్న దర్శకుడు విశాల్ భరద్వాజ్
- ఎఫ్ఏసీటీ సహా పలు ట్రైబ్యునళ్ల రద్దు
- 19కి పడిపోనున్న ట్రైబ్యునళ్ల సంఖ్య
- బిల్లుకు పార్లమెంటు అనుమతి లభించకపోవడంతో అత్యవసర ఆదేశాలు
- ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
నిజానికి ఈ నిర్ణయానికి సంబంధించిన బిల్లును ఫిబ్రవరిలోనే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం లభించలేదు. దీంతో అత్యవసరంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఎఫ్ఏసీటీని రద్దు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల సినిమాల విడుదలలో ఆలస్యం జరుగుతుందని, సినీ రంగానికి ఇదో దుర్దినమని దర్శకుడు విశాల్ భరద్వాజ్ మండిపడ్డారు.