అప్పట్లో ఇలా ఉండేదాన్నంటూ టీనేజి ఫొటో పంచుకున్న సమీరా రెడ్డి
- సోషల్ మీడియా వచ్చాక సినీ తారలను వేధిస్తున్న బాడీ షేమింగ్
- పెళ్లయ్యాక మారిపోతున్న రూపురేఖలు
- విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
- టీనేజీలోనే ఈ సమస్య ఎదుర్కొన్నానంటున్న సమీరా
తాను టీనేజీలోనే బాడీ షేమింగ్ సమస్యను ఎదుర్కొన్నానని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. అప్పట్లో సినిమాల్లోకి రాకముందు తాను ఎలా ఉన్నానో చూడండి అంటూ ఓ ఫొటోను పంచుకుంది. అందులో సమీరా చాలా బొద్దుగా ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ఫొటోపై ఆమె వ్యాఖ్యానిస్తూ... టీనేజీలో తన శరీరాకృతి పట్ల చాలామంది రకరకాల వ్యాఖ్యలు చేసేవాళ్లని, అలాంటి ప్రతికూల వ్యాఖ్యలతో ఎంతో బాధ కలిగేదని వెల్లడించింది.
అందుకే, తన పిల్లలకు ఇప్పటినుంచే ఇలాంటి పరిస్థితుల పట్ల అవగాహన కల్పిస్తున్నానని తన పోస్టులో వివరించింది. ఎదుటివాళ్లు ఎలా ఉన్నా, అందరినీ సమదృష్టితో చూడాలని చెబుతున్నానని పేర్కొంది. సమాజంలో ఎదురయ్యే సమస్యల పట్ల సహనం వహించాలని సూచిస్తున్నానని తెలిపింది.