మన దేశంలో టాప్ 10 శాతం సంపన్నుల కంటే ఆ దేశాల్లో పేదలే రిచ్ అట!
- భారత్‌లో దిగువ 10 శాతం ప్రజల రోజువారీ వినియోగ స్థాయి 3 డాలర్లు
- భారత్‌లో ఎగువ 10 శాతం ప్రజల రోజువారీ స్థాయి 10 డాలర్లు
- అమెరికాలో దిగువ 10 శాతం ప్రజల స్థాయి 25 డాలర్లు, కెనడాలో 31 డాలర్లు
- దేశవ్యాప్తంగా ఆదాయాలు, ఉత్పాదకత పెరగాలని నిపుణులు సూచన
ఒక దేశంలో అత్యంత పేదలుగా ఉన్నవారి ఆదాయం.. మరో దేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్నవారి ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రపంచ బ్యాంకు గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అమెరికా, కెనడా, జర్మనీ వంటి సంపన్న దేశాల్లో దిగువ 10 శాతం ప్రజల ఆదాయ స్థాయి.. భారత్‌లో ఎగువ 10 శాతం ప్రజల స్థాయిని మించిపోయింది. దేశాల మధ్య జీవన ప్రమాణాల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రోజుకు ఎంత సంపాదిస్తే టాప్ 10 శాతంలో ఉన్నట్లు?
ప్రపంచ బ్యాంకు 2026 పేదరికం, అసమానతల గణాంకాల ప్రకారం.. భారత్‌లో దిగువ 10 శాతం ప్రజల రోజువారీ ఆదాయం లేదా వినియోగ స్థాయి ఒక్కో వ్యక్తికి సుమారు 3 డాలర్లు. అదే ఎగువ 10 శాతం ప్రజల విషయంలో ఈ స్థాయి రోజుకు 10 డాలర్లుగా ఉంది. భారత ఆర్థిక సర్వే ప్రకారం.. నెలకు రూ.80 వేల ఆదాయం ఉన్న వ్యక్తి కూడా దేశంలోని అత్యధిక ఆదాయం పొందుతున్న 10 శాతం మందిలో ఉంటారు.
సంపన్న దేశాల్లో పేదల స్థాయి ఎంతంటే..
అమెరికాలో దిగువ 10 శాతం ప్రజల రోజువారీ ఆదాయం లేదా వినియోగ స్థాయి 25 డాలర్లు. కెనడాలో 31 డాలర్లు కాగా.. జర్మనీ, ఆస్ట్రేలియాలో 28 డాలర్లుగా ఉంది. అంటే భారత్‌లో అత్యధిక ఆదాయం పొందుతున్న వర్గం స్థాయి కంటే.. ఈ దేశాల్లో దిగువ ఆదాయ వర్గాల స్థాయి కూడా ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఇవి దేశాల మధ్య జీవన వ్యయాల తేడాలను సర్దుబాటు చేసిన గణాంకాలు.
భారత్ ముందున్న అసలు సవాలిదే!
పేదరికాన్ని తగ్గించడం మాత్రమే సరిపోదని ఆర్థికాభివృద్ధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆదాయాలు, ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కొత్త ఆలోచనలకు అవకాశాలు కల్పించడం, వ్యాపారాల విస్తరణకు అడ్డంకులు తగ్గించడం, మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు పెంచడం కీలకమని పేర్కొంటున్నారు. అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి.. సంపన్న దేశాలతో ఉన్న అంతరం తగ్గే అవకాశం ఉంటుంది.