ఆర్బీఐ చర్యలు.. డాలర్‌పై భారీగా బలపడిన రూపాయి
- రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ కఠిన చర్యలు
- తాజా నిర్ణయాలతో డాలర్ మారకంలో భారీగా బలపడిన రూపాయి
- ఫారెక్స్ డెరివేటివ్ లావాదేవీలపై ఆంక్షలు, కొత్త రిజర్వ్ విధానం
- ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ప్రత్యేక డాలర్ విండో ఏర్పాటు
భారత కరెన్సీ రూపాయి పతనాన్ని అడ్డుకుని, మార్కెట్లో స్పెక్యులేషన్‌కు కళ్లెం వేసేందుకు ఆర్బీఐ తీసుకున్న తాజా చర్యలు వెంటనే సానుకూల ఫలితాలనిచ్చాయి. ఈరోజు ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక శాతానికి పైగా లాభపడి 95.76 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఆఫ్‌షోర్ మార్కెట్లోనూ రూపాయి బలంగా పుంజుకుంది. 2013 తర్వాత రూపాయిని నిలబెట్టేందుకు ఆర్బీఐ తీసుకున్న అత్యంత కఠినమైన చర్యల్లో ఇవి కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠమైన 97కు చేరువవుతుండటంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. శనివారం నాడు పలు కీలకమైన చర్యలను ప్రకటించింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థల డాలర్ అవసరాలను తీర్చడం కోసం ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఫారెక్స్ డెరివేటివ్ లావాదేవీలపై కొత్త రిజర్వ్ నిబంధనను కూడా ప్రవేశపెట్టింది. అంతకుముందు గత బుధవారం వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ, అవసరమైతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సంకేతాలిచ్చింది.
అక్టోబర్ ఆరంభంలో కూడా ఆర్బీఐ కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది. అన్‌హెడ్జ్‌డ్ ఫారెక్స్ డెరివేటివ్ లావాదేవీల పరిమితిని 100 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు భారీగా తగ్గించింది. దీంతో పాటు కొత్తగా ‘ఫారెన్ ఎక్స్ఛేంజ్ రిస్క్ రిజర్వ్’ (ఎఫ్ఈఆర్ఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద 2 మిలియన్ డాలర్లకు మించిన ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులపై, కాంట్రాక్ట్ విలువలో 20% మొత్తాన్ని నగదు రూపంలో ఆర్‌బీఐ వద్ద రిజర్వ్‌గా ఉంచాలని అధీకృత డీలర్లను ఆదేశించింది. రద్దు చేసిన డెరివేటివ్ కాంట్రాక్టులను మళ్లీ రీబుక్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే, మెచ్యూరిటీ సమయంలో కాంట్రాక్టులను రోలోవర్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ వరుసగా ఇన్ని చర్యలు తీసుకోవలసి రావడం, పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని సోషియేట్ జనరల్ సంస్థకు చెందిన ఎమర్జింగ్ ఆసియా స్ట్రాటజిస్ట్ గాల్విన్ చియా అభిప్రాయపడినట్లు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' నివేదించింది. మొత్తం మీద రూపాయి విలువ 97 స్థాయిని దాటకుండా చూసేందుకు ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చర్యలతో మార్కెట్లో క్రమశిక్షణ పెరిగి, పారదర్శక వాతావరణం ఏర్పడుతుందని ఆర్బీఐ భావిస్తోంది.