ఢిల్లీలో ‘ఇండి’ నిరసన.. సాయంత్రం 4 వరకు మెట్రో సేవలు నిలిపివేత
Add ap7am to your home Screen

ఢిల్లీలో ‘ఇండి’ నిరసన.. సాయంత్రం 4 వరకు మెట్రో సేవలు నిలిపివేత

INDIA Alliance protest in Delhi Metro services suspended until 4 PM
  • ఇండి కూటమి ర్యాలీతో ఢిల్లీలో ఆంక్షలు
  • భద్రతా కారణాలతో ఆరు మెట్రో స్టేషన్ల మూసివేత
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు సేవలు బంద్
  • సీఈసీ రాజీనామా కోరుతూ సుప్రీంకోర్టుకు విపక్షాల పాదయాత్ర
  • నేతలతో భేటీకి నిరాకరించిన సీజేఐ కార్యాలయం
విపక్షాల ‘ఇండి’ కూటమి తలపెట్టిన నిరసన ర్యాలీ నేపథ్యంలో సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆరు కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ స్టేషన్లలో సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.

మూసివేసిన స్టేషన్లలో రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, జన్‌పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ ఉన్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో సిద్ధం చేసుకోవాలని డీఎంఆర్సీ సూచించింది.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో "చలో ఢిల్లీ - ప్రజాస్వామ్యం కోసం మార్చ్" పేరిట ‘ఇండి’ కూటమి నేతలు సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని, వివాదాస్పద ‘సర్’ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. అయితే, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య భేటీకి సమయం కోరగా, సీజేఐ కార్యాలయం ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం.
Advertisement
INDIA Alliance
Delhi Metro
Rahul Gandhi
March for Democracy
Delhi Metro service suspended
Supreme Court protest

More Telugu News