జగన్ కేసులపై సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. రోజంతా విచారణకు డిమాండ్
Add ap7am to your home Screen

జగన్ కేసులపై సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. రోజంతా విచారణకు డిమాండ్

  • రోజువారీ విచారణకు ఈడీ పిటిషన్ వేయడం సరైనదేనని వ్యాఖ్య
  • డిశ్చార్జి పిటిషన్లతో జగన్ విచారణను ఆలస్యం చేస్తున్నారని ఆరోపణ
  • తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్లు కూడగట్టారని విమర్శ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన కేసుల్లో కేవలం రోజువారీ విచారణ మాత్రమే కాకుండా, రోజంతా విచారణ జరగాలని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆయన పూర్తిగా సమర్థించారు.

ఈడీ పిటిషన్ వేయడం 100 శాతం సరైన చర్య అని, ఇది ఎప్పుడో జరగాల్సిందని సోమిరెడ్డి అన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతి కేసు అని ఆయన అభివర్ణించారు. 2011లో సీబీఐ కేసులు నమోదు చేసి 15 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు విచారణ ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రూ.43 వేల కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై నమోదైన కేసులు మూడేళ్లలోనే పూర్తయితే, జగన్ మాత్రం పదేళ్లుగా విచారణ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. డిశ్చార్జి పిటిషన్ల పేరుతో కేసుల విచారణను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఈడీ హైకోర్టును ఆశ్రయిస్తే, జగన్ పత్రిక గొంతు చించుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
Advertisement

More Telugu News