మా విజేతల వివరాలు వెబ్ సైట్లో విడుదల చేశాం... మీ వాళ్ల ఫొటోలు విడుదల చేయగలరా?: చంద్రబాబుకు సజ్జల సవాల్
- ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
- ఫలితాలపై భిన్న ప్రకటనలు చేసిన వైసీపీ, టీడీపీ
- టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న సజ్జల
- ఇంకా ఎందుకు అబద్ధాలు చెబుతారంటూ చంద్రబాబుపై విమర్శలు
అంతకుముందు ఓ ట్వీట్ లో ఆయన స్పందిస్తూ, రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు ఇప్పుడు తిరగరాశారని పేర్కొన్నారు. నిజాయతీ, నిబద్ధతతో హామీలను నెరవేర్చే జగనే మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ తీర్పు ద్వారా వెల్లడించారని సజ్జల వివరించారు.