‘నీ వయసులో నాకు 2 జాతీయ పురస్కారాలు వచ్చాయి’.. కాక్రోచ్ పార్టీ ప్రతినిధిపై కంగన ఘాటు విమర్శలు
- సౌరవ్ దాస్‌పై కంగనా తీవ్ర విమర్శలు
- ‘28 ఏళ్లకి ఇంకా స్టూడెంటా?’ అంటూ ప్రశ్న
- తన జాతీయ పురస్కారాలను ప్రస్తావించిన కంగనా
- ‘పనిలేనివాడివి.. నైపుణ్యం నేర్చుకో’ అంటూ విమర్శ
- సీజేపీ ఉద్యమంపై మరోసారి విమర్శలు
బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్ మరోసారి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఈసారి ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. సౌరవ్ దాస్ తనను తాను విద్యార్థిగా చెప్పుకోవడాన్ని ప్రశ్నిస్తూ.. ఆయనకు ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన రాజకీయ, సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తాను సాధించిన విజయాలను గుర్తు చేశారు.
ఏఎన్‌ఐ ఇంటర్వ్యూకు సంబంధించిన సౌరవ్ దాస్ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్న కంగనా ‘‘గూగుల్‌లో వెతికితే ఆయన వయసు 28 ఏళ్లని తెలిసింది. ఆ వయసులో కూడా తనను విద్యార్థిగా ఎలా చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదు. నేను రెండేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, 20 ఏళ్లుగా ప్రజాజీవితంలోనే ఉన్నాను. ఆయన వయసులోనే నాకు రెండు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ప్రస్తుతం ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దర్శకురాలు, నటి, నిర్మాత, కథా రచయిత్రి, పారిశ్రామికవేత్తగా కూడా పని చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
అంతటితో ఆగని కంగనా.. సౌరవ్ దాస్‌పై మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీలాంటి పూర్తిగా పనిలేని, నిరుద్యోగ వ్యక్తికి విజయవంతమైన జీవితం అంటే ఏంటో అర్థం కాదు. నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. పూర్తిగా పనిలేనివాడివి. ముందుగా ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు. అదే నీకు మంచి ఆరంభం అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై సీజేపీ చేపట్టిన ఆందోళన ఇటీవల కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ వంటి పలు డిమాండ్లను కేంద్రం అంగీకరించిన తర్వాత నెలరోజులుగా కొనసాగిన ఉద్యమాన్ని సీజేపీ విరమించింది. ఈ ఉద్యమంపై కంగనా గతంలో కూడా విమర్శలు చేశారు. నిరసనల తీరును తప్పుబట్టడమే కాకుండా, ఉద్యమంలో పాల్గొన్న యువతపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.