గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ పై అప్ డేట్!
- గోపీచంద్ 'సీటీమార్' విడుదలకు సిద్ధం
- మారుతి దర్శకత్వంలో తాజా చిత్రం
- రేపే పూజ.. టైటిల్ కూడా ప్రకటన
- ప్రచారంలో 'పక్కా కమర్షియల్' టైటిల్
ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా ఆసక్తికరంగా వివరించారు. 'అరేయ్.. ఓ వందిస్తే గోపీచంద్, మారుతి సినిమా టైటిల్ చెప్తా ..రేపు ముహూర్తం టైమ్ కి' అంటూ ఒకరంటుంటే... దానికి జవాబుగా 'ఒరేయ్.. టైటిల్ చెప్పడానికి కూడా డబ్బులేంట్రా? మరీ ఇంత కమర్షియలా?' అంటూ రెండో వ్యక్తి అంటున్నట్టుగా పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సంభాషణలో 'కమర్షియల్' అనే పదాన్ని హైలైట్ చేశారన్న మాట!