కంగనాకు కొత్త చిక్కులు... నోటీసులు పంపిన రచయిత
- గతంలో మణికర్ణిక చిత్రంలో నటించిన కంగనా
- మణికర్ణిక సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు
- అది తన నవలే అంటున్న ఆశిష్ కౌల్ అనే రచయిత
- అన్ని హక్కులు తన వద్దే ఉన్నాయని వెల్లడి
అయితే, ఈ చిత్రాన్ని తన నవల ఆధారంగా తీస్తున్నారంటూ ఆశిష్ కౌల్ అనే రచయిత లీగల్ నోటీసులు పంపాడు. ఆశిష్ కొన్నాళ్ల కిందట 'దిద్దా... కశ్మీర్ కి యోధా రాణి' అనే నవల రాశాడు. అయితే, ఈ నవలకు సంబంధించిన అన్ని హక్కులు తన వద్దే ఉన్నాయని, అలాంటప్పుడు తన అనుమతి లేకుండా కంగనా ఆ సినిమాను ఎలా తెరకెక్కిస్తుందని ఆశిష్ ప్రశ్నిస్తున్నాడు. దీనిపై కంగనా స్పందించాల్సి ఉంది.