'తలైవి' నుంచి అర‌వింద్ స్వామి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

arvind swamy first look
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న ‘తలైవి’ సినిమాలో ఎంజీఆర్ పాత్ర‌ని అర‌వింద్ స్వామి పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో ఆయన ఎంజీఆర్ పాత్రలో ప్రజలకు నమస్తే చెబుతున్నట్లు ఈ లుక్ ఉంది. మరో లుక్ లో ఆయన పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు.

ప్రకాశ్ రాశ్, భాగ్యశ్రీ కూడా ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి లుక్ ఆక‌ట్టుకుంటోంది. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ మరణానంతరం జరిగిన పరిణామాల పర్యవసానంగా, ఆయన రాజకీయ వారసురాలిగా జయలలిత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె ఆరుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.
Go Back to Shorts
Kangana Ranaut
Bollywood
Tollywood

More Telugu News