'తలైవి' షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో కంగనా రనౌత్ భావోద్వేగభరిత ట్వీట్
- తలైవి వంటి పాత్రలో నటించే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది
- ఈ పాత్ర ప్రేమలో నేను పడిపోయా
- ఇది విప్లవ నాయకురాలి పాత్ర
- సినిమా యూనిట్‌ను వదిలిపోతుండడం బాధగా ఉంది
ఈ సినిమా గురించి కంగనా తాజాగా మరో విషయం తెలిపింది. దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి పాత్రలో నటించే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుందని తెలిపింది. ఈ పాత్రతో తాను ప్రేమలో పడిపోయానని, ఇది విప్లవ నాయకురాలి పాత్ర అని ఆమె చెప్పింది.
ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, దర్శకుడు విజయ్‌తో పాటు ఈ చిత్ర యూనిట్ విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, విజయేంద్ర ప్రసాద్, బృంద ప్రసాద్ వంటి అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇటువంటి సినిమా యూనిట్‌ను వదిలిపోతుండడం బాధగా ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో అన్ని భావోద్వేగాలు తనలో ఉన్నాయని తెలిపింది. ఈ సందర్భంగా జయలలిత ఫొటోతో పాటు జయలలిత పాత్రలోని తన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది.