తొందరెందుకు? ఆ సరదా కూడా తీర్చుకుందురు!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

vijaya sai slams chandrababu
  • ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘ఇరగదీశారు’
  • ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట
  • మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నారు
  • జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ గురించి ప్రస్తావిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలంటించారు. తిరుపతి లోక్‌సభ స్థానంపై చంద్రబాబు నాయుడు ఇంకా ఆశలు పెట్టుకున్నారని, ప్రజలు వైసీపీకి దూరమయ్యారని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.  

‘జీహెచ్ఎంసీ ఎన్నికలలో ‘ఇరగదీసిన’ తర్వాత తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు కనుసైగ చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట. మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నా జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందరెందుకు? ఆ సరదా కూడా తీర్చుకుందురు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News