తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసుల నిర్ధారణ
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసుల నిర్ధారణ

857 new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,51,188 
  • మొత్తం 2,30,568 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1381
  • 19,239 యాక్టివ్ కేసులు
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 857 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,504 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,51,188 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,30,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1381 కి చేరింది. ప్రస్తుతం 19,239 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  16,449 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 250 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 112 కేసులు నిర్ధారణ అయ్యాయి.
 
Corona Virus
COVID19
Telangana

More Telugu News