మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే
- ఎన్సీపీలో చేరబోతున్న ఏక్‌నాథ్
- ఆయన నిర్ణయం ఒక చేదు నిజమన్న రాష్ట్ర బీజేపీ చీఫ్
- మరింత మంది వస్తున్నారన్న ఎన్సీపీ
తాజాగా, పార్టీకి రాజీనామా చేసిన ఆయన శరద్ పవార్ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఖడ్సేలానే మరింత మంది బీజేపీ నేతలు ఎన్సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎన్సీపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ పేర్కొన్నారు. ఖడ్సే చేరికతో ఖాందేశ్ ప్రాంతంలో ఎన్సీపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏక్‌నాథ్ నిర్ణయాన్ని తాము ఊహించలేదని, ఆయన పార్టీని వీడడం ఓ చేదు నిజమని బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు.