వ్యవసాయ బిల్లుపై వ్యాఖ్యానించిన కంగన... కర్ణాటకలో కేసు నమోదు
- వ్యవసాయబిల్లుపై దుష్ప్రచారం చేసేవాళ్లు ఉగ్రవాదులన్న కంగన
- కోర్టుకు ఫిర్యాదు చేసిన న్యాయవాది
- కంగనాపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు
ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కంగనా ట్వీట్ చేశారు. "నాడు సీఏఏకి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపింపచేసి అల్లర్లకు కారణమైన వాళ్లే నేడు వ్యవసాయ బిల్లుపైనా దుష్ప్రచారం చేస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు, వారు ఉగ్రవాదులతో సమానం" అంటూ వ్యాఖ్యలు చేశారు.