వరద నేపథ్యంలో.. చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు పంపిన అధికారులు
- కృష్ణానదికి పోటెత్తుతున్న వరద
- కరకట్టపై ఉండే వారికి నోటీసులిచ్చిన అధికారులు
- చంద్రబాబుతో పాటు మరో 36 ఇళ్లకు నోటీసులు
భారీ వరద నేపథ్యంలో కరకట్ట వద్ద ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు. ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. కరకట్ట ప్రాంతంలోని నివాసాల్లోకి ఏ సమయంలోనైనా వరదనీరు చేరవచ్చని అధికారులు హెచ్చరించారు.