ఆడపిల్లల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించే రాక్షసులు కూడా ఉన్నారా?: హీరోయిన్ అనుష్క శర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆడపిల్లల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించే రాక్షసులు కూడా ఉన్నారా?: హీరోయిన్ అనుష్క శర్మ

anushka sharma about hatras incident
  • హత్రాస్‌లో చోటు చేసుకున్న ఘటన దారుణం
  • పిల్లాడు పుడితే మన సమాజం గొప్పగా భావిస్తుంది
  • అమ్మాయి పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటు చేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా స్పందిస్తూ.. పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె గర్భిణి అన్న విషయం తెలిసిందే. చాలా దారుణమైన ఘటన గురించి వినాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

ఆడపిల్లల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించే రాక్షసులు కూడా ఉన్నారా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు. పిల్లాడు పుడితే మన సమాజం గొప్పగా, విశేషంగా భావిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, నిజానికి అమ్మాయి పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదని ఆమె చెప్పారు. పిల్లాడు పుడితే అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు ఈ విషయంగా బాగా ఆలోచించాలని ఆమె తెలిపారు.

సమాజం గౌరవించే విధంగా అబ్బాయిలను పెంచాలని, అప్పుడే తాము గొప్ప అని భావించాలని ఆమె చెప్పారు.  ఈ సమాజ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులుగా దీన్ని బాధ్యత అనుకోవాలని చెప్పారు. అబ్బాయి పుడితే ఓ విశేషంలా భావించకూడదని, సమాజంలో మహిళలు సురక్షితంగా, క్షేమంగా బతుకుతున్నామని భావించాలని, ఆ ఈ విధంగా పిల్లల్ని పెంచాలని ఆమె చెప్పారు.
Anushka Sharma
Crime News
Uttar Pradesh

More Telugu News