సుశాంత్ సింగ్ మృతి కేసు.. రియా సోదరుడు, సుశాంత్ మేనేజర్ అరెస్ట్
- షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండాలు అరెస్ట్
- పది గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ
- షోవిక్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను సీజ్
అంతకుముందు నిన్న ఉదయం షోవిక్, మిరండా నివాసాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. షోవిక్ చక్రవర్తి గంజాయి, మరిజువానాలను ఆర్డర్ చేసి డ్రగ్ సరఫరాదారు అబ్దుల్ బాసిత్ పరిహార్‌కు గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరిపేవాడని ఎన్‌సీబీ కోర్టుకు తెలియజేసింది.