ఇక మీకు పాత ఫేస్ బుక్ కనిపించదు!
- ఫేస్ బుక్ కు కొత్త రూపు
- క్లాసిక్ ఫేస్ బుక్ కు మరికొన్నిరోజుల్లో స్వస్తి
- కొత్తగా డార్క్ మోడ్ ఫీచర్
వాస్తవానికి కొన్నినెలల కిందటే న్యూ ఫేస్ బుక్ ఫీచర్ మెనూ లిస్టులో కనిపిస్తోంది. అయితే న్యూ ఫేస్ బుక్ ఇష్టంలేని వాళ్లు క్లాసిక్ లోనే కొనసాగే వెసులుబాటు ఇన్నాళ్లు అందించింది. ఇకమీదట ఆ క్లాసిక్ లుక్ ను నిలిపివేయాలని ఫేస్ బుక్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్ కూడా పూర్తిగా మార్చేసింది, అంతేకాదు, డార్క్ మోడ్ ఫీచర్ ను కూడా ఫేస్ బుక్ తన వినియోగదారులకు అందిస్తోంది.