ఇప్పటి వరకు12 వేలమందికిపైగా ‘మహా’ పోలీసులకు కరోనా.. 125 మంది మృతి

Over 12 thousand police personnel in Maharashtra Infected to corona
  • ఇప్పటి వరకు 12,290 మంది పోలీసులకు సోకిన మహమ్మారి
  • గత 24 గంటల్లోనే 303 మందికి సంక్రమించిన వైరస్
  • వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 2,315 మంది
కరోనాతో కకావికలం అవుతున్న మహారాష్ట్రలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఆ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 12,290 మంది పోలీసులు ఈ వైరస్ బారినపడగా, వారిలో 125 మంది మరణించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. గత 24 గంటల్లోనే 303 మంది పోలీసులకు వైరస్ సంక్రమించగా, వారిలో ఒకరు మరణించారు. 9,850 మంది కరోనా బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 2,315 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వివరించారు. కాగా, దేశవ్యాప్తంగా చూసుకుంటే నిన్నటి వరకు 25,89,682 కేసులు నమోదయ్యాయి. 6,77,444 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 18,62,258 మంది కోలుకున్నారు. 49,980 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
Go Back to Shorts
Maharashtra
Police
Corona Virus
corona deaths

More Telugu News