అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా టీడీపీ ప్రజల పక్షమే: చంద్రబాబు
- కరోనా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు అభినందనలు
- ముందుండి నిలిచేవాడే నాయకుడంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
- తమది బాధ్యత గల ప్రతి పక్షం అంటూ వ్యాఖ్యలు
బాధ్యత గల ప్రతిపక్షంగా టీడీపీ వ్యవహరిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంతో బాధ్యతతో, నిబద్ధతతో సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు పేరుపేరునా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ సమయంలోనూ ప్రభుత్వం ఒత్తిడి పెంచే చర్యలకు దిగిందని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సరే అరెస్ట్ చేస్తున్నారని, అందుకు నలంద కిశోర్ ఉదంతమే నిదర్శనమని అన్నారు.