ఈ ట్రక్కు మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి ఏడాది పట్టింది!
- 2019 జూలైలో నాసిక్ నుంచి బయల్దేరిన భారీ వాహనం
- నాలుగు రాష్ట్రాల గుండా పయనం
- రోజుకు 5 కిలోమీటర్ల ప్రయాణం
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పరిశోధనలకు అవసరమైన అత్యాధునిక యంత్ర సామగ్రిని ఈ వాహనం మోసుకొచ్చింది. రాకెట్ తయారీకి అవసరమైన తక్కువ బరువుండే పదార్ధాన్ని రూపొందించే ఏరోస్పేస్ హారిజాంటల్ ఆటోక్లేవ్ ను ఈ భారీ వాహనంపై తరలించారు. ఆ యంత్ర సామగ్రి బరువు 70 టన్నులు కాగా, అంత బరువును మోస్తూ ఈ ట్రక్కు రోజుకు 5 కిలోమీటర్ల చొప్పున నాలుగు రాష్ట్రాల గుండా పయనించి ఎట్టకేలకు తిరువనంతపురంలో ప్రవేశించింది. కాగా, ఈ ట్రక్కుపై 32 మంది సిబ్బంది కూడా ఉన్నారట.