Nakka Anand Babu: ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా పడటానికి కారణం ఇదే: నక్కా ఆనంద్ బాబు విమర్శలు

Nakka Anand Babu criticises AP Govt
షార్ట్స్‌లో చూడండి
ఇళ్ల స్థలాల పంపిణీని తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు వచ్చాయని... అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని అన్నారు. ఇళ్ల స్థలాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని... దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఈ నెల 8న రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు స్థలాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కరోనా కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించింది.
Go Back to Shorts
Nakka Anand Babu
House Lands
Telugudesam
YSRCP

More Telugu News