సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మరో హిందీ సినిమాలో పూజ హెగ్డే
- ఎన్నారై యువకుడిగా ఎన్టీఆర్
- సీక్వెల్ చేయనున్న సూర్య
* 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, ఇందులో ఎన్టీఆర్ ఎన్నారై గా కనిపిస్తాడట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు.
* నాలుగేళ్ల క్రితం సూర్య కథానాయకుడుగా విక్రంకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ '24' వినూత్న చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి దర్శకుడు విక్రంకుమార్ చెబుతూ, ప్రస్తుతం స్క్రిప్టు పని జరుగుతోందని చెప్పారు.