అందుకే అమెరికా వచ్చాను.. త్వరలో తిరిగి వచ్చేస్తా!: సన్నీ లియోన్
- భర్త డేనియల్ వెబర్, పిల్లలతో అమెరికాలో ఉంటోన్న సన్నీ
- భర్త కుటుంబ సభ్యులు అమెరికాలోనే ఉంటున్నారన్న సన్నీ
- తన అత్తయ్యను చూసుకోవాల్సి ఉందని వ్యాఖ్య
తన భర్త డేనియల్ కుటుంబ సభ్యులు అమెరికాలోనే ఉంటున్నారని సన్నీ చెప్పింది. తన అత్తయ్య వయసులో చాలా పెద్దవారని, ఆమెకు ఈ సమయంలో తమ అవసరం చాలా ఉందని ఆమె చెప్పింది. వైరస్ వ్యాప్తి సమయంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది.
అందుకే తాము అమెరికాకు వెళ్లామని, అంతర్జాతీయ విమానాల సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే తిరిగి వచ్చేస్తానని సన్నీ లియోన్ తెలిపింది. కాగా, ఆమెరికాలో ఆమె కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోంది. కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది.