సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Anushka confirmed for sequel
  • సీక్వెల్ కి అనుష్క ఖరారు 
  • జూలై నుంచి పవన్ 'విరూపాక్ష'
  • స్క్రిప్టు పనిలో అడివి శేష్
 *  కమలహాసన్ సరసన అందాల అనుష్క నటించనుంది. గతంలో వచ్చిన 'రాఘవన్' చిత్రానికి గౌతమ్ మీనన్ ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో కమల్ సరసన నయనతార నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, దర్శకుడు గౌతమ్ ఆ పాత్రకు అనుష్కను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'విరూపాక్ష' పేరిట ఓ చారిత్రాత్మక కథా చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించే ఈ చిత్రం షూటింగ్ జూలై నుంచి రెగ్యులర్ గా జరుగుతుందని తెలుస్తోంది.
*  గతంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ 'గూఢచారి' మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతం దీనికి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారు. ఇదిలావుంచితే, అడివి శేష్ మరోపక్క 'మేజర్' చిత్రంలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా దాని షూటింగ్ వాయిదా పడడంతో, ప్రస్తుతం ఆ సీక్వెల్ కి స్క్రిప్టును తయారుచేసుకునే పనిలో శేష్ బిజీగా వున్నాడు.  
Go Back to Shorts
Anushka Shetty
Pawan Kalyan
Krish
Adivi Sesh

More Telugu News