టాలీవుడ్ సినీ కార్మికుల కోసం నాగార్జున భారీ విరాళం
- లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోతున్న సినీ కార్మికులు
- ఉపాధి లేక అలమటిస్తున్న వైనం
- రూ.1 కోటి విరాళం ఇస్తున్నట్టు నాగ్ వెల్లడి
అటు, చిరంజీవి సినీ కార్మికుల కోసం ప్రత్యేక చారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తమ విజ్ఞప్తి మేరకు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.3.8 కోట్ల విరాళాలు వచ్చాయని చిరంజీవి వెల్లడించారు. నాగార్జున రూ.1 కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ రూ.1 కోటి, రామ్ చరణ్ రూ.30 లక్షలు, మహేశ్ బాబు రూ.25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు ఇచ్చారని వివరించారు. అందరికంటే ముందు చిరంజీవి సినీ వర్కర్ల కోసం రూ.1 కోటి విరాళం ప్రకటించారు.