నా మాటల వల్ల బాధపడి ఉంటే క్షమించండి: బహిరంగంగా క్షమాపణ చెప్పిన జానీ మాస్టర్

Jani Master offers public apology if his words hurt anyone
  • తన ప్రవర్తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలన్న జానీ మాస్టర్
  • పరిశ్రమలో అందరి మధ్య ఐక్యత అవసరమని వ్యాఖ్య
  • డ్యాన్సర్లు, టెక్నీషియన్ల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపు

తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల గానీ, తన ప్రవర్తన వల్ల గానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే లేదా ఎవరైనా బాధపడి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని ఆయన కోరారు. సినీ పరిశ్రమలోని సభ్యులందరి మధ్య ఐక్యత చాలా అవసరమని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే యూనియన్‌కు, పరిశ్రమలోని కార్మికులకు మంచి జరుగుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


యూనియన్ వేదికపై జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అనవసర విభేదాలు పక్కన పెట్టి డ్యాన్సర్లు, టెక్నీషియన్ల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలో అందరం ఒకే కుటుంబం లాంటివాళ్లమని, ఐక్యతను చాటాల్సిన సమయంలో వివాదాలకు చోటు ఇవ్వకూడదని కోరారు.

Advertisement
Jani Master
TFTDDA
Tollywood choreographer
Public apology
Telugu Film Industry
Dancers Association

More Telugu News