'వయసుకొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదు'.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Bombay High Court rules adult children are not parents property
  • ఇష్టమైన వ్యక్తితో జీవించేందుకు మేజర్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టీకరణ
  • కూతురి కస్టడీ కోరుతూ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
  • అక్రమ నిర్బంధం రుజువైతేనే హెబియస్ కార్పస్ చెల్లుబాటు అవుతుందని వెల్లడి
వయసుకొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదని, వారు తమ జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్రులని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు వెళ్లిన కుమార్తెను తమకు అప్పగించాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మేజర్‌ అయిన యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కోర్టు సమర్థించింది.

నాగ్‌పుర్‌కు చెందిన ఓ యువతి 17 ఏళ్ల వయసులో ట్యూషన్‌కు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి, ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను గుర్తించి తల్లికి అప్పగించారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తన కుమార్తెను ఆ యువకుడు అక్రమంగా నిర్బంధించాడంటూ తల్లి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.

విచారణ సందర్భంగా కోర్టు నేరుగా ఆ యువతితో మాట్లాడింది. తాను తన ఇష్టప్రకారమే ఆ యువకుడితో కలిసి ఉంటున్నానని, అతనితోనే జీవించాలనుకుంటున్నానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె మేజర్ అని నిర్ధారించుకున్న న్యాయస్థానం, ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని తెలిపింది. అక్రమ నిర్బంధం రుజువు కాని పక్షంలో హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని స్పష్టం చేస్తూ తల్లి పిటిషన్‌ను నాగ్‌పూర్‌ ధర్మాసనం కొట్టివేసింది. 
Advertisement
Bombay High Court
Adult children rights
Right choose partner
Habeas Corpus petition
Nagpur Bench ruling
Parental property law

More Telugu News