7,000mAh బ్యాటరీ.. 144Hz డిస్‌ప్లే.. రియల్‌మీ 16ఎక్స్ 5జీ వచ్చేసింది
- మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
- ప్రారంభ ధర రూ.25,999
- ఆఫర్లతో రూ.రూ.23,999కి తగ్గుదల
- 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే
- 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా
భారత్‌లో రియల్‌మీ 16ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది. 7,000mAh భారీ బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఇది లభిస్తుంది.
రియల్‌మీ 16x 5జీ బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.25,999గా నిర్ణయించారు. 6జీబీ + 128జీబీ మోడల్ రూ.27,999, 6జీబీ + 256జీబీ వేరియంట్ రూ.30,999గా ఉంది. ఎండ్యూరెన్స్ బ్రౌన్, గ్లోరీ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ లేదా గరిష్ఠంగా రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తున్నారు. దీంతో ఫోన్ ప్రారంభ ధర రూ.23,999కి తగ్గుతుంది. అదనంగా 10 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
రియల్‌మీ 16ఎక్స్ 5జీలో 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్ఠంగా 1,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉండటం ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు ఏఐ ఎరేజర్, ఏఐ అల్ట్రా క్లారిటీ, మోషన్ ఫొటో, డ్యుయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.