మెగా హీరో జోడీగా బాలీవుడ్ భామ
- బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- ఈ నెల 24వ తేదీన షూటింగు మొదలు
ఈ అమ్మాయి ఎవరో కాదు .. బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు. సల్మాన్ సరసన 'దబాంగ్ 3'లో సందడి చేసింది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాను అల్లు బాబీ - సందీప్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సయీ మంజ్రేకర్ ను తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.