రైతులారా జాగ్రత్త! అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడు: అంబటి రాంబాబు
- చంద్రబాబు కుట్ర స్వభావం కలిగినవాడు
- అధికారం కోసం దేనికైనా తెగించే బాబును నమ్మొద్దు
- రైతులకు ఇదే నా విజ్ఞప్తి
భళారే విచిత్రం.. భూమి అంటే ఎంత ప్రేమ భువనేశ్వరి గారికి?
చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజును నిన్న అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇవ్వడంపై అంబటి విమర్శలు చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో రాష్ట్రం భగ్గున మండిపోయినప్పుడు, సమైక్య నినాదంతో ప్రజలు రగిలిపోయినప్పుడు, హైదరాబాద్ మనకు కాకుండా పోయినప్పుడు కూడా భువనేశ్వరికి ప్రజలపై జాలి కలగలేదని అన్నారు. ‘భళారే విచిత్రం.. భూమి అంటే ఎంత ప్రేమ భువనేశ్వరి గారికి?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన భర్త, కుమారుడు బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల కోసం దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారంటే ‘శభాష్.. గొప్పగా చెప్పుకోవాలి’ అంటూ ఎద్దేవా చేశారు.